Jump to content

టిమ్ బెర్నర్స్ లీ

వికీపీడియా నుండి
ప్రొఫెసర్ సర్

టిమ్ బెర్నర్స్ లీ

Sir Tim Berners Lee arriving at the Guildhall to receive the Honorary Freedom of the City of London
2014 లో బెర్నర్స్ లో
జననం
తిమోతీ జాన్ బెర్నర్స్ లీ

(1955-06-08) 1955 జూన్ 8 (వయసు 69)
లండన్, ఇంగ్లండ్
ఇతర పేర్లుTimBL
TBL
విద్యద క్వీన్స్ కాలేజ్, ఆక్స్‌ఫర్డ్ (BA)
జీవిత భాగస్వామి
నాన్సీ కార్ల్‌సన్
(m. 1990; విడాకులు 2011)

రోస్‌మేరీ లీత్
(m. 2014)
పిల్లలు2 పిల్లలు; 3 సవతి పిల్లలు
తల్లిదండ్రులుకాన్వే బెర్నర్స్ లీ
మేరీ లీ వూడ్స్
పురస్కారాలుట్యూరింగ్ అవార్డు (2016)
క్వీన్ ఎలిజబెత్ ప్రైజ్ (2013)
ఫారెన్ అసోసియేట్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (2009)
ఆర్డర్ ఆఫ్ మెరిట్ (2007)
ACM సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ అవార్డ్ (1995)
టిమ్ బెర్నర్స్ లీ
వృత్తిసంస్థలుCERN
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (MIT)
W3C
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం

సర్ తిమోతీ బెర్నర్స్ లీ ఒక బ్రిటీష్ కంప్యూటర్ శాస్త్రవేత్త. వరల్డ్ వైడ్ వెబ్ (World Wide Web or www) సృష్టికర్తగా సుపరిచితుడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ లో ప్రొఫెషనల్ ఫెలో,[1] ఈయన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (MIT) కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసరు.[2][3] ఈయన 1989 మార్చి 12లో ఒక ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం ప్రతిపాదించాడు.[4][5]

2004 లో రెండవ ఎలిజబెత్ రాణి వెబ్ రంగంలో ఆయన చేసిన మార్గనిర్దేశమైన పరిశోధనలకు గాను నైట్ హుడ్ తో సత్కరించింది.[6][7]

వరల్డ్ వైడ్ వెబ్ సృష్టించినందుకు గాను 2007 లో నేషనల్ అకాడెమీ ఆఫ్ ఇంజనీరింగ్ కు ఎంపికయ్యాడు. 2016లో ఈయనకు కంప్యూటర్ సైన్స్ లో ప్రతిష్టాత్మకమైన ట్యూరింగ్ అవార్డు లభించింది. వరల్డ్ వైడ్ వెబ్ సృష్టించినందుకు, మొదటి వెబ్ బ్రౌజర్ తయారు చేసినందుకు, వెబ్ ను విస్తృత పరిచేందుకు అవసరమైన అల్గారిథమ్స్, ప్రోటోకాల్స్ (నియమావళి) ని రూపొందించినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది.[8]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

టిం బెర్నర్స్ లీ 1955 జూన్ 8 న ఇంగ్లండు లోని లండన్ లో మేరీ లీ వుడ్స్, కాన్వే బెర్నర్స్ లీ దంపతులకు జన్మించాడు.[9] నలుగురు పిల్లల్లో ఈయన పెద్దవాడు. ఈయన తల్లిదండ్రులు మొదటి తరం కంప్యూటర్ అయిన ఫెర్రాంటి మార్క్ 1 మీద పనిచేసిన కంప్యూటర్ శాస్త్రవేత్తలు. ఇతని సోదరుడు మైక్ బెర్నర్స్ లీ పర్యావరణ శాస్త్రంలో ప్రొఫెసరు. ప్రాథమిక విద్య షీన్ మౌంట్ ప్రైమరీ స్కూల్లో చదివాడు. 1969-73 మధ్యలో ఎమ్మాన్యుయేల్ స్కూల్లో చదివాడు.[10]

వృత్తి

[మార్చు]

గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే డోర్సెట్, పూలెలో ప్లెస్సీ అనే టెలికమ్యూనికేషన్స్ సంస్థలో ఇంజనీరుగా పనిచేశాడు. 1978 లో డి.జి. నాష్ సంస్థలో చేరి ప్రింటర్స్ కోసం టైప్ సెట్టింగ్ సాఫ్ట్‌వేర్ తయారు చేశాడు. 1980 జూన్ నుంచి డిసెంబరు వరకు సెర్న్ లో ఇండిపెండెంట్ కాంట్రాక్టరుగా పనిచేశాడు. జెనీవాలో ఉండగా పరిశోధకులు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకుగా వీలుగా హైపర్ టెక్స్ట్ ఆధారంగా ఒక ప్రాజెక్టు కోసం ప్రతిపాదన చేశాడు.[11] దాన్ని అందరికీ తెలియజేసేందుకు ఎంక్వైర్ అనే నమూనాను తయారు చేశాడు.[12]

1980 దశాబ్దం చివరి భాగంలో ఈయన సెర్న్ ను వదిలి బోర్న్‌మౌత్, డోర్సెట్ లో జాన్ పూలేకి సంబంధించిన ఇమేజ్ కంప్యూటర్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే సంస్థలో చేరాడు.[13] మూడేళ్ళపాటు ఆ సంస్థ సాంకేతిక విభాగాన్ని నడిపించాడు.[14] అక్కడ ఆయన రియల్ టైమ్ రిమోట్ ప్రొసీజర్ కాల్ ప్రాజెక్టు మీద పనిచేశాడు. దీని వలన ఆయనకు కంప్యూటర్ నెట్‌వర్కింగ్ మీద అవగాహన వచ్చింది.[13] 1984 లో మళ్ళీ సెర్న్ లో ఫెలోగా తిరిగి వచ్చాడు.[12]

మూలాలు

[మార్చు]
  1. "Tim Berners-Lee". Department of Computer Science.
  2. "Sir Tim Berners-Lee joins Oxford's Department of Computer Science". University of Oxford.
  3. "Tim Berners-Lee | MIT CSAIL". www.csail.mit.edu (in ఇంగ్లీష్).
  4. "30 years on, what's next #ForTheWeb?". World Wide Web Foundation (in ఇంగ్లీష్).
  5. "info.cern.ch – Tim Berners-Lee's proposal". Info.cern.ch. Retrieved 21 December 2011.
  6. "Web's inventor gets a knighthood". BBC News. 31 December 2003. Retrieved 10 November 2015.
  7. "Creator of the web turns knight". BBC News. 16 July 2004. Retrieved 10 November 2015.
  8. "A. M. Turing Award". Association for Computing Machinery. 2016. Retrieved 4 April 2017.
  9. "Berners-Lee Longer Biography". World Wide Web Consortium. Retrieved 18 January 2011.
  10. మూస:Who's Who (subscription required)
  11. "Berners-Lee's original proposal to CERN". w3.org. World Wide Web Consortium. March 1989. Retrieved 25 May 2008.
  12. 12.0 12.1 Stewart, Bill. "Tim Berners-Lee, Robert Cailliau, and the World Wide Web". Retrieved 22 July 2010.
  13. 13.0 13.1 Berners-Lee, Tim. "Frequently asked questions". World Wide Web Consortium. Retrieved 22 July 2010.
  14. Grossman, Wendy (15 July 1996). "All you never knew about the Net ...". The Independent.