GNU ఉచిత భావవ్యక్తీకరణ లైసెన్సు
Appearance
GNU Free Documentation License (GNU FDL లేదా GFDL) అనేది, GNU ప్రాజెక్టు కోసం Free Software Foundation (FSF) రూపొందించిన కాపీలెఫ్టు లైసెన్సు. దీని ద్వారా కాపీ చేసుకునేందుకు, తిరిగి పంపిణీ చేసుకునేందుకు, మార్పుచేర్పులు చేసుకునేందుకు పాఠకులకు హక్కు లభిస్తుంది. వాటిని ఉపయోగించి తయారు చేసిన కొత్త ఉత్పత్తులను తిరిగి అదే లైసెన్సుకు అనుగుణంగా విడుదల చేసందుకు నిబంధన కూడా ఉంది. కాపీలను లాభాలకు అమ్ముకోవచ్చు కూడా. కాకపోతే 100 కంటే ఎక్కువ కాపీలు అమ్మితే అసలు కాపీ లేదా దాని సోర్సు కోడును కూడా కొనేవారికి అందుబాటులో ఉంచాలి.