Jump to content

HTTP

వికీపీడియా నుండి

HTTP (హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్) అనేది డిస్ట్రిబ్యూటెడ్, సహకార, హైపర్ మీడియా సమాచార వ్యవస్థ కోసం తయారు చేసిన అంతర్జాల నియమావళి (ఇంటర్నెట్ ప్రోటోకాల్ స్యూట్) నమూనాలో అప్లికేషన్ ప్రోటోకాల్. ఒకదానితో ఒకటి అనుసంధానించబడీన హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్లతో కూడుకున్న వరల్డ్ వైడ్ వెబ్ లో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ఈ ప్రోటోకాల్ కీలకపాత్ర పోషిస్తుంది.

ఈ ప్రోటోకాల్ ని 1989 లో టిమ్ బెర్నర్స్ లీ సెర్న్ లో పని చేస్తున్నపుడు మొదటిసారిగా ఒక సరళమైన పత్రంగా ప్రచురించాడు. ఇది 0.9 వర్షన్.[1] దీని తర్వాత మరికొన్ని మార్పులు చేర్పులు చేసి 1.0 వర్షన్ విడుదల చేశారు.[2]

కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్‌ఫోర్స్ (IETF), ఇంకా వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం (W3C) ఉమ్మడి సహకారంతో, ఆర్.ఎఫ్.సి (RFC - Request For Comments) పత్రాలు ప్రచురించడం ద్వారా HTTP ముందుకు తీసుకువెళ్ళడం ప్రారంభమైంది.

HTTP/1 పూర్తి ప్రతి, డాక్యుమెంటేషన్ 1996లో పూర్తయింది.[3] 1997 నాటికి 1.1 వర్షన్ విడుదలైంది. తర్వాత 1999, 2014, 2022 సంవత్సరాల్లో ఈ స్పెసిఫికేషన్లను తాజాకరించారు.[4] సుమారు 85% పైగా వెబ్‌సైట్లు భద్రతతో కూడుకున్న HTTPS ని వాడుతున్నాయి.[5]

పనిచేసే విధానం

[మార్చు]

HTTP క్లైంట్ సర్వర్ నమూనాలో రిక్వెస్ట్ రెస్పాన్స్ పద్ధతిలో పని చేస్తుంది. ఉదాహరణకు వెబ్ బ్రౌజర్ ఒక క్లైంటు. ఏదైనా ఒక కంప్యూటరు మీద పనిచేస్తూ, అంతర్జాలం సాయంతో వెబ్ డాక్యుమెంట్లను పంపిణీ చేసిది సర్వరు. క్లైంట్ ఏదైనా రిసోర్సు కోసం HTTP రిక్వెస్టు పంపితే, దానికి బదులుగా సర్వర్ ఆ రిసోర్సును రెస్పాన్స్ రూపంలో క్లైంటుకు పంపుతుంది. ఇది HTML పేజీలైనా కావచ్చు లేదా, బొమ్మలు లాంటి ఇతర మాధ్యమాలైనా కావచ్చు.

మూలాలు

[మార్చు]
  1. Tim Berner-Lee (1991-01-01). "The Original HTTP as defined in 1991". www.w3.org (in ఇంగ్లీష్). World Wide Web Consortium. Retrieved 2010-07-24.
  2. Tim Berner-Lee (1992). "Basic HTTP as defined in 1992". www.w3.org (in ఇంగ్లీష్). World Wide Web Consortium. Retrieved 2021-10-19.
  3. In RFC 1945. That specification was then overcome by HTTP/1.1.
  4. RFC 2068 (1997) was obsoleted by RFC 2616 in 1999, which was obsoleted by RFC 7230 in 2014, which was obsoleted by RFC 9110 in 2022.
  5. "Usage Statistics of Default protocol https for websites". w3techs.com. Retrieved 2024-01-05.